వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థంపై హీరో విశాల్ స్పందన
- నికోలాయ్ సచ్ దేవ్ తో వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం
- వరలక్ష్మి వివాహ బంధంలో అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉందన్న విశాల్
- గతంలో విశాల్, వరలక్ష్మి మధ్య ప్రేమాయణం అంటూ ప్రచారం
ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ నిశ్చితార్థం ప్రముఖ గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్ దేవ్ తో ఘనంగా జరిగింది. దీనిపై విశాల్ స్పందించారు. వరలక్ష్మి పెళ్లి చేసుకోబోతున్నందుకు తాను సంతోషిస్తున్నానని తెలిపారు. ఆమె కెరీర్ లో ఎదగాలన్న లక్ష్యాన్ని అందుకుందని, తెలుగులో ఎంతో గుర్తింపు సాధించిందని, అందుకు ఆనందిస్తున్నానని పేర్కొన్నారు.