తల్లి కోసం సాయిబాబా గుడి కట్టించిన తమిళ సినీ నటుడు విజయ్
- విజయ్ సాయిబాబా గుడి కట్టించారన్న వార్త నిజమేనన్న ఆయన తల్లి శోభ
- సాయిబాబా గుడి నిర్మించాలని తనకు ఎంతో కాలంగా ఉండేదని వెల్లడి
- ప్రతి గురువారం తాను అక్కడికి వెళుతుంటానన్న శోభ
- పేదలకు ఇకపై నిత్యాన్నదానం చేసే యోచనలో ఆలయ కమిటీ
ఇటీవల విజయ్ చెన్నైలోని ఓ సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా పూజారులతో కలిసి ఫొటోలు దిగారు. ఇది నెట్టింట వైరల్‌గా మారడంతో పాటూ ఆలయాన్ని విజయ్ కట్టించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో, విజయ్ తల్లి శోభ ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు.
ఇక విజయ్ ప్రస్తుతం వెంకట ప్రభు దర్శకత్వంలో ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ మూవీలో నటిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కథతో సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రశాంత్, ప్రభుదేవా కీలకపాత్రలు పోషిస్తున్నారు.