వార్-2 చిత్రీకరణ కోసం ముంబయి చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్
- తొలిసారిగా బాలీవుడ్ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్
- హృతిక్ రోషన్ ప్రధానపాత్రలో వార్-2
- కీలకపాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్
ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దేవర ఈ ఏడాది అక్టోబరులో ప్రేక్షకుల ముందుకు వస్తుందని భావిస్తున్నారు. వార్-2 చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 15న రిలీజ్ కానుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఓ గూఢచారి పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.