శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి సుధీర్‌రెడ్డిపై హత్యాయత్నం.. కత్తితో వచ్చిన వ్యక్తిని పట్టుకున్న కార్యకర్తలు
- శ్రీకాళహస్తిలోని బహుదూరుపేటలో ప్రచారంలో ఉండగా ఘటన
- సెల్ఫీ తీసుకుంటానంటూ కత్తితో వచ్చిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగింత
- అతడిని వైసీపీ సానుభూతిపరుడు మహేశ్‌కుమార్‌గా గుర్తింపు
సుధీర్‌రెడ్డిని హత్య చేసేందుకే అతడు వచ్చాడంటూ టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేశాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు మాత్రం బహుదూరుపేటలోని జాతరకు వచ్చానని చెబుతున్నాడు. మరి కత్తి ఎందుకని ప్రశ్నిస్తే మాత్రం తన భద్రత కోసం అని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలు కోరుతున్నారు.