టాలీవుడ్ నటి నీలం ఉపాధ్యాయతో ప్రియాంకచోప్రా సోదరుడి నిశ్చితార్థం
- ఎంగేజ్మెంట్ ఫొటోలు పంచుకున్న సిద్ధార్థ్-నీలం
- గతంలో ఇషితా కుమార్‌తో సిద్ధార్థ్ నిశ్చితార్థం
- ఏప్రిల్ 2019లో జరగాల్సిన పెళ్లి రద్దు
- ‘మిస్టర్ 7’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన నీలం ఉపాధ్యాయ
ప్రియాంక కూడా ఇన్‌స్టా స్టోరీస్‌లో సిద్ధార్థ్, నీలం ఫొటోలను షర్ చేసింది. ఈ ఫొటోల్లో ప్రియాంక భర్త నిక్ జొనాస్ కూడా కనిపించాడు. సిద్ధార్థ్‌కు ఇంతకుముందు ఇషితా కుమార్‌తో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 2019లో వీరి వివాహం జరగాల్సి ఉండగా అనూహ్యంగా రద్దు చేసుకున్నారు.
నీలం ఉపాధ్యాయ 2010లో తొలి సినిమా చేసినప్పటికీ అది అటకెక్కింది. రెండేళ్ల తర్వాత తెలుగులో ‘మిస్టర్ 7’ అనే సినిమాలో నటించింది. 2013లో అల్లరి నరేశ్‌తో ‘యాక్షన్ త్రీడీ’ నటించింది. అదే ఏడాది ‘ఉన్నోడు ఒరు నాల్’ సినిమాతో తమిళంలో అరంగేట్రం చేసింది.