ఎక్కడ చూసినా అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఫొటోలే!
- ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం
- నిన్న దుబాయ్ లో విగ్రహాన్ని ఆవిష్కరించిన బన్నీ
- తన విగ్రహం పక్కనే నిల్చుని ఫొటోలకు పోజులు
పుష్ప చిత్రంలోని ఐకానిక్ 'తగ్గేదే లే' పోజుతో ఉన్న బన్నీ మైనపు విగ్రహం రెడ్ జాకెట్, గ్రే ట్రౌజర్ లో ఒరిజినాలిటీకి బాగా దగ్గరగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడెక్కడ చూసినా ఇవే ఫొటోలు కనిపిస్తున్నాయి. తమ ఆరాధ్య హీరో అంతర్జాతీయ ఘనత అందుకోవడం పట్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో ఆనందం అంబరాన్నంటుతోంది.

