కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలల్లో రూ.16,400 కోట్ల అప్పులు చేసింది: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కేసీఆర్ రూ.6.71 లక్షల కోట్ల అప్పులు చేసిందని ఆరోపిస్తున్నారని ఆగ్రహం
- నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పెద్ద ఎత్తున అప్పులు చేసిందని విమర్శ
- కేసీఆర్ చేసిన అప్పులతో కనీసం మౌలిక సదుపాయాలు వచ్చాయన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- కాంగ్రెస్ అప్పులతో అభివృద్ధి లేదని ఆగ్రహం
కేసీఆర్ చేసిన అప్పులతో కనీసం మౌలిక సదుపాయాలైనా వచ్చాయని తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పులతో అభివృద్ధి ఊసు లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్యారెంటీల గారడీ నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఈ నాలుగు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.