విజువల్స్ తోనే 'ఔరా' అనిపిస్తూ దూసుకుపోతున్న 'కంగువా' టీజర్!
- సూర్య కథానాయకుడిగా రూపొందుతున్న 'కంగువా'
- పూర్తిగా వేరే కాలంలో నడిచే కథ
- సూర్య కెరియర్లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీ ఇదే
- 38 భాషల్లో విడుదల కానున్న సినిమా
- గ్రాఫిక్స్ కి పెద్ద పీట వేసిన కంటెంట్
నాయకుడి వైపు నుంచి .. ప్రతి నాయకుడి వైపు నుంచి ఈ టీజర్ ను కట్ చేశారు. గుర్రాలపై .. పడవలపై పోరాట సన్నివేశాలు టీజర్ కి హైలైట్ గా నిలిచాయి. పంచభూతాలు అనే కాన్సెప్ట్ తీసుకున్నారేమో, అందుకు తగినట్టుగా నింగి .. నేల .. నీరు .. నిప్పు .. గాలి సంబంధింతమైన విజువల్స్ తో ఈ టీజర్ ను వదిలారు. కాస్ట్యూమ్స్ ను .. ఆయుధాలను డిజైన్ చేసిన తీరు, లొకేషన్స్ ప్రత్యేకమైన ఆకర్షణగా కనిపిస్తున్నాయి.
విజువల్స్ పరంగా సినిమాపై అంచనాలు పెంచేలా టీజర్ తోనే మంచి మార్కులు కొట్టేశారు. అందువల్లనే ఈ టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. గ్రాఫిక్స్ పరంగా మంచి క్వాలిటీ కనిపిస్తోంది. కెమెరా పనితనం ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతోంది. సూర్య కెరియర్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా .. అత్యధిక భాషల్లో విడుదల కానున్న సినిమా ఇదే కావడం విశేషం. కథానాయికగా దిశా పటాని సందడి చేయనుండగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో బాబీ డియోల్ .. జగపతిబాబు .. యోగిబాబు కనిపించనున్నారు.