మళ్లీ వస్తున్న 'మగధీర'... రీ రిలీజ్ ఎప్పుడంటే...!
- మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు
- అభిమానులకు ఒక రోజు ముందే కానుక
- మార్చి 26న మగధీర రీ రిలీజ్
ఈ సందర్భంగా శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్ బాబు మాట్లాడుతూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేస్తున్నామని వెల్లడించారు.
తమను ప్రోత్సహించి, ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు.
తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని మరోసారి ఆదరించి ఘన విజయాన్ని అందించాలని, తద్వారా రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నామని తెలిపారు.