త్వరలో ఆ డైరెక్టర్స్ ను కలుస్తాను: 'మీన్ గర్ల్స్' అవంతిక
- 'మీన్ గర్ల్స్'తో పాప్యులర్ అయిన అవంతిక
- 'బిగ్ గర్ల్స్ డోంట్ క్రై'తో మరింత క్రేజ్
- హీరోయిన్ గా చేయాలనుందని వెల్లడి
- టాలీవుడ్ లో ఆ డైరెక్టర్స్ ఇష్టమని వ్యాఖ్య
'మీన్ గర్ల్స్' కి నేను ఆడిషన్స్ పంపించిన తరువాత మూడు నెలల పాటు అటు వైపు నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దాంతో ఇక నాకు అవకాశం లేదనే అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో నాకు పిలుపు వచ్చింది. అందులో నటించే ఛాన్స్ రావడం నా అదృష్టంగానే భావిస్తున్నాను. ఇంతవరకూ నా ఏజ్ కి తగిన పాత్రలను పోషిస్తూ వచ్చాను. త్వరలో ఇక్కడ హీరోయిన్ గా చేయాలని అనుకుంటున్నాను" అంది.
" తెలుగులో రాజమౌళిగారు .. త్రివిక్రమ్ గారు .. సుకుమార్ గారు .. శేఖర్ కమ్ములగారి సినిమాలంటే నాకు ఇష్టం. త్రివిక్రమ్ గారి సినిమా 'అజ్ఞాతవాసి'లో నటించాను. హీరోయిన్ గా వాళ్లందరి సినిమాల్లో కనిపించాలని ఉంది. త్వరలో వాళ్లను కలవాలనీ .. ఆడిషన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను" అని చెప్పింది.