జమ్మికుంట తహసీల్దార్ నివాసంలో ఏసీబీ సోదాలు
- ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణల నేపథ్యంలో రెయిడ్
- హనుమకొండలోని బంధువుల నివాసంలోనూ తనిఖీ
- పట్టుబడ్డ నగదు, ఆస్తుల వివరాలు వెల్లడించని అధికారులు
అయితే, ఇప్పటి వరకు ఎంత నగదు బయటపడింది, రజని ఎన్ని ఆస్తులు కూడబెట్టారు? అనే వివరాలను ఏసీబీ అధికారులు బయటపెట్టలేదు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడే వివరాలు వెల్లడించలేమని చెప్పినట్లు సమాచారం. ఏసీబీ అధికారులు రెండు బృందాలుగా విడిపోయి మంగళవారం ఉదయం జమ్మికుంటలోని రజనీ నివాసానికి, హనుమకొండలోని ఆమె బంధువుల ఇంటికి ఏకకాలంలో చేరుకున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి అధికారులు వివరాలు వెల్లడించే అవకాశం ఉందని సమాచారం.