విజయసాయిరెడ్డి 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోతారు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
- నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న విజయసాయి
- విజయసాయి నెల్లూరు ఆహ్వాన కార్యక్రమం ఫ్లాప్ అయిందని ఎద్దేవా
- అనిల్ యాదవ్ విశ్వాసం లేని వ్యక్తి అని విమర్శ
మాజీ మంత్రి అనిల్ యాదవ్ సరసరావుపేటలో ఎంపీగా గెలవలేరని కోటంరెడ్డి చెప్పారు. అనిల్ డూపుల సంఘానికి అధ్యక్షుడని... ఆయనొక నయా బందిపోటు అని అన్నారు. సీటు ఇప్పించిన ఆనం వివేకానందరెడ్డిపైనే అనిల్ తిరగబడ్డాడని... విశ్వాసం లేకుండా ఆయన్నే బెదరించాడని మండపడ్డారు. అనిల్ లెక్కలను ప్రజలే సరి చేస్తారని చెప్పారు. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంత మెజార్టీతో గెలుస్తారో... నరసరావుపేటలో అంతే మెజార్టీతో అనిల్ ఓడిపోతాడని అన్నారు.