కాక రేపుతున్న నెల్లూరు రాజకీయాలు... వేమిరెడ్డిని కలిసిన కోటంరెడ్డి
- వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
- టీడీపీలోకి రావాలంటూ ఆహ్వానం పలికిన సోమిరెడ్డి
- వైసీపీ కుట్రలు భరించలేకే వేమిరెడ్డి బయటికి వచ్చేశారన్న కోటంరెడ్డి
వైసీపీ బహిష్కరణకు గురైన కోటంరెడ్డి ఇటీవల కాలంలో టీడీపీతో కలిశారు. ఇప్పుడాయన వేమిరెడ్డితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ... వైసీపీ కుట్రలు భరించలేకే వేమిరెడ్డి పార్టీకి రాజీనామా చేశారని వెల్లడించారు. గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి వేమిరెడ్డి కృషి చేశారని తెలిపారు. వైసీపీ గెలుపునకు పాటుపడిన వేమిరెడ్డికి అవమానాలే దక్కాయని అన్నారు. వేమిరెడ్డిని టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తామని కోటంరెడ్డి చెప్పారు.