పార్లమెంటు ఎన్నికల వేళ వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు.. రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి గుడ్‌బై!
- ఇప్పటికే పార్టీని వీడిన ముగ్గురు ఎమ్మెల్యేలు
- నెల్లూరు నగర సమన్వయకర్తగా ఎండీ ఖలీల్ నియామకం
- తనకు కనీస సమాచారం లేదని మనస్తాపం
- నేడో, రేపో పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా
ఈ నేపథ్యంలో పార్టీని వీడాలని వేమిరెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలిసింది. నేడో, రేపో వైసీపీ జిల్లా అధ్యక్ష పదవితోపాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. అనంతరం భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని ఆయన అనుచరులు తెలిపారు. కాగా, రానున్న ఎన్నికల్లో వైసీపీ తరపున నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీచేస్తానని గతంలో వేమిరెడ్డి ప్రకటించారు. అయితే, ఆ తర్వాత పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో తనకు టికెట్ దక్కే అవకాశం లేదని భావించి పార్టీ మార్పుకు సిద్ధమైనట్టు ఆయన సన్నిహిత వర్గాల సమాచారం.