హిట్ కొట్టిన 'భ్రమయుగం' .. ఈ సినిమా కథేమిటి?
- మలయాళంలో విడుదలైన 'భ్రమయుగం'
- హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్న మమ్ముట్టి
- పూర్తి బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇది
ఈ నెల 15వ తేదీన ఈ సినిమాను అక్కడ రిలీజ్ చేశారు. ఈ సినిమాకి అక్కడ మంచి రెస్పాన్స్ వస్తోంది. మౌత్ టాక్ తోనే రోజురోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయి. అలాగే థియేటర్లను కూడా పెంచుతున్నారు. డిఫరెంట్ లుక్ తో మమ్ముట్టి ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. హారర్ థ్రిల్లర్ జోనర్లో ఈ సినిమాను నిర్మించారు. కథాపరంగా చూసుకుంటే ఇది ఆంగ్లేయుల కాలంలో కేరళలో జరిగిన సంఘటనగా తెరపైకి వస్తుంది.
కేరళలోని ఒక ఇంట్లో కథానాయకుడు తన వంటవాడితో కలిసి ఒక పాత ఇంట్లో నివసిస్తూ ఉంటాడు. ఒక రోజున తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఇంటికి వచ్చిన ఒక కొత్త వ్యక్తి, కథానాయకుడిని ఆశ్రయం కోరతాడు. ఆ తరువాత ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధమవుతాడు. కానీ ఆ ఇంట్లో నుంచి బయటపడలేకపోతాడు. అందుకు కారణం ఏమిటి? అప్పుడతను ఏం చేస్తాడు? అనేది కథ. త్వరలోనే ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.