వర్మ టాలెంట్ నాకు ఆ రోజునే అర్థమైపోయింది: సినిమాటోగ్రఫర్ ఎస్. గోపాల్ రెడ్డి
- షూటింగ్స్ చూడటానికి తనతో పాటు లొకేషన్స్ కి వచ్చేవాడన్న గోపాల్ రెడ్డి
- వర్మ కథ చెప్పే తీరు, కాన్ఫిడెన్స్ చూడగానే టాలెంటెడ్ అని అర్థమైందని వెల్లడి
- సౌండ్ ఎఫెక్ట్స్ లో మార్పు తెచ్చింది ఆయనేనని వ్యాఖ్య
"రామ్ గోపాల్ వర్మ దర్శకుడు కాకముందే, షూటింగ్స్ చూడటానికి నాతో పాటు లొకేషన్స్ కి వచ్చేవాడు. ఆ తరువాతనే ఆయన నాకు 'శివ' కథ చెప్పారు. అప్పటివరకూ తెలుగు తెరపై నడుస్తూ వస్తున్న ట్రెండ్ వేరు. వర్మ కథ చెప్పే తీరు .. ఆయనలో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్ ను చూడగానే ఆయన చాలా టాలెంటెడ్ అనే విషయం నాకు అర్థమైపోయింది" అని అన్నారు.
"తెలుగులో అంతకుముందు సౌండ్ ఎఫెక్ట్స్ పై పెద్దగా దృష్టి పెట్టినవారు లేరు. కానీ వర్మ వస్తూనే సౌండ్ ఎఫెక్ట్స్ పై దృష్టి పెట్టాడు .. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలోను కొత్తదనం ఉండేలా చూసుకున్నాడు. సౌండ్ ఎఫెక్ట్స్ లోను .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లోను ఒక మార్పు అనేది వర్మతోనే మొదలైంది" అని చెప్పారు.