నేను అతడి వీరాభిమానిని.. సహచర ఆటగాడిపై ప్రశంసల జల్లు కురిపించిన స్పిన్నర్ అశ్విన్
- వైజాగ్ టెస్టులో పేసర్ బుమ్రా అసలుసిసలైన ప్రదర్శన చేశాడంటూ పొగిడిన దిగ్గజ స్పిన్నర్
- సెంచరీతో చెలరేగిన శుభ్‌మాన్ గిల్‌పైనా ప్రశంసలు
- తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడిన రవిచంద్రన్ అశ్విన్
ఇంగ్లండ్, ఇండియా టెస్టు సిరీస్‌లో బుమ్రా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నాడని అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. ఇక వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్‌కు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో తన సెంచరీతో కీలక పాత్ర పోషించిన యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్‌ను కూడా అశ్విన్ మెచ్చుకున్నాడు. అనుభవజ్ఞుడిలా ఆడాడని కొనియాడాడు. శుభ్‌మాన్ గిల్ ప్రతిభపై ఎలాంటి సందేహం లేదని, సెంచరీలు సాధించగల సమర్థవంతమైన ఆటగాడని పేర్కొన్నాడు. ఇదిలావుండగా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక మైలురాయికి చేరువలో ఉన్నాడు. మరో వికెట్ తీస్తే టెస్టులో 500 వికెట్లు తీసిన బౌలర్‌గా అవతరించనున్నాడు.