రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు... చెప్పు తీసి చూపించిన బీఆర్ఎస్ నేత
- కేసీఆర్పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల మీద బాల్క సుమన్ మండిపాటు
- ముఖ్యమంత్రిని చెప్పుతో కొడతానంటూ ఆగ్రహం
- తనకు సంస్కారం అడ్డు వస్తోందని వ్యాఖ్య
రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తూ ఓ సమయంలో తన కాలికి ఉన్న చెప్పును తీసి చూపించారు. కేసీఆర్ను లంగా అంటున్న రేవంత్ రెడ్డినే పెద్ద రండగాడు, హౌలేగాడు అంటూ దూషించారు. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదని.. సంస్కారం అడ్డువచ్చి ఆగుతున్నామని వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి... తన పదవిని బట్టి, స్థాయిని బట్టి మాట్లాడాలని సూచించారు. రైతుబంధు డబ్బులు అడిగితే కాంగ్రెస్ మంత్రులు రైతులను చెప్పుతో కొడతామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు కోసం గత ప్రభుత్వం విడుదల చేసిన రూ.7,700 కోట్లను మంత్రి పొంగులేటికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్కి, కాంగ్రెస్ కంట్రాక్టర్ల జేబుల్లోకి మళ్ళించారని ఆరోపించారు.