సక్సెస్ ను హ్యాండిల్ చేయడం చాలా కష్టం: డైరెక్టర్ ప్రశాంత్ వర్మ
- ఈ నెల 12వ తేదీన విడుదలైన 'హను మాన్'
- భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతున్న సినిమా
- ఇంతటి హిట్ ఊహించలేదన్న డైరెక్టర్
- ఇదంతా హనుమంతుడు చేసిన మేజిక్కని వ్యాఖ్య
"టీజర్ ... ట్రైలర్ తోనే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. రిలీజ్ సమయానికి థియేటర్లు పెద్దగా దొరకలేదు. దాంతో ఈ సినిమాను తప్పకుండా హిట్ చేయాలనే ఉద్దేశంతోనే ఆడియన్స్ వచ్చారు .. వచ్చిన తరువాత కనెక్ట్ అయ్యారు. నార్త్ లోను ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ రాబట్టడం విశేషం. ఈ సినిమా ఒక్కోరోజు ఒక్కో రికార్డును క్రియేట్ చేస్తుంటే, నాకు ఇదంతా ఒక కలగా అనిపించేది" అన్నాడు.
"ఈ సినిమా ఒక స్థాయిని దాటేసిన తరువాత మాత్రం, ఇదంతా హనుమంతుడే చేయిస్తున్నాడనే ఒక నమ్మకం కలిగింది. ఈ సినిమా రిలీజ్ అయిన తరువాత సింగీతం శ్రీనివాసరావుగారు కాల్ చేసి, సక్సెస్ ను హ్యాండిల్ చేయడం చాలా కష్టమని చెప్పారు. ఆయన అలా ఎందుకన్నారనేది నాకు ఆ తరువాత అర్థమవుతూ వస్తోంది" అని చెప్పాడు.