కోమటిరెడ్డి వీధిరౌడీలా ప్రవర్తిస్తున్నాడు: బీఆర్ఎస్ ఎంపీ తీవ్ర ఆగ్రహం
- కోమటిరెడ్డి తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు వంటిదన్న ఎంపీ లింగయ్య యాదవ్
- ఇంత దుర్మార్గంగా గతంలో ఏ మంత్రి వ్యవహరించలేదని వ్యాఖ్య
- కోమటిరెడ్డి తాను మంత్రి అనే సోయి లేకుండా నిందించడం హేయమైన చర్య అన్న ఎంపీ
కోమటిరెడ్డి తాను మంత్రి అనే సోయి లేకుండా నిందించడం హేయమైన చర్య అన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకొని అరాచకం చేశారన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టి పోలీసులతో ఏకమై గూండాయిజం చేశారని ఆరోపించారు. కోమటిరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతారో అర్థం కావడం లేదన్నారు. ఆటవిక పాలనతో కాంగ్రెస్ ప్రజాగ్రహానికి గురవుతోందన్నారు. బీఆర్ఎస్ పాలనలో తాము ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదన్నారు. కోమటిరెడ్డి ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని హితవు పలికారు. ఇలా చేస్తే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదన్నారు. కోమటిరెడ్డి అహంకారాన్ని వదులుకోవాలని సూచించారు.