నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత.. నెట్‌వర్క్ హాస్పిటల్స్ యాజమాన్యాల సంఘం నిర్ణయం
- తమ డిమాండ్లను పరిష్కరించకపోవడంతో సమ్మె బాట పట్టిన నెట్‌వర్క్ ఆసుపత్రులు
- ప్రస్తుతం అడ్మిషన్లో ఉన్న రోగులకు యథావిధిగా చికిత్స అందించనున్నట్టు వెల్లడి
- కొత్తగా రోగులను చేర్చుకోబోమని తెలిపిన ఆసుపత్రులు
- బకాయిల చెల్లింపు, శస్త్ర చికిత్సల ప్యాకేజీల పెంపు కోసం డిమాండ్ చేస్తున్న నెట్‌వర్క్ ఆసుపత్రులు
నిజానికి గత ఏడాది డిసెంబరు 29 నుంచి సేవలు నిలిపివేస్తున్నట్లు నెట్‌వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి. అయితే ప్రభుత్వం చర్చలకు పిలవడంతో సమ్మెను విరమించుకున్నారు. హామీ మేరకు ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చలేదంటూ ఇప్పుడు మరోసారి సమ్మెకు పిలుపునిచ్చారు.