మేనల్లుడి నిశ్చితార్థం కోసం హైదరాబాద్ వెళుతున్న సీఎం జగన్
- జనవరి 18న షర్మిల తనయుడి నిశ్చితార్థం
- హైదరాబాదులోని గోల్కొండ రిసార్ట్స్ లో వేడుక
- రేపు సాయంత్రం హైదరాబాద్ పయనం
గురువారం సాయంత్రం 6.45 గంటలకు ఆయన గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరనున్నారు. రాత్రి 7.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు గండిపేటలోని గోల్కొండ రిసార్ట్స్ కు వెళ్లి... తన మేనల్లుడి నిశ్చితార్థ వేడుకలో పాల్గొంటారు. అనంతరం, రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి తాడేపల్లి బయల్దేరనున్నారు.
కాగా, ఆ మరుసటి రోజు (జనవరి 19) విజయవాడలో 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఆవిష్కరించనున్నారు.