గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా
- మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం
- జనవరి 12న రిలీజ్
- జనవరి 6న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని భావించిన వైనం
- భద్రతాపరమైన అనుమతుల కారణంగా జరపలేకపోతున్నామన్న చిత్రబృందం
అయితే, సెక్యూరిటీ అనుమతులు లభించకపోవడంతో ఈ ఫంక్షన్ ను వాయిదా వేస్తున్నట్టు గుంటూరు కారం టీమ్ వెల్లడించింది. ముందు నిర్ణయించిన మేరకే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపేందుకు శాయశక్తులా కృషి చేశామని, కానీ అనుకోని కారణాల వల్ల కార్యక్రమాన్ని నిర్వహించలేకపోతున్నామని ఓ ప్రకటనలో పేర్కొంది. అభిమానులకు క్షమాపణలు తెలుపుకుంటున్నామని వెల్లడించింది. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు కొత్త తేదీ ప్రకటిస్తామని గుంటూరు కారం టీమ్ తెలిపింది.