పవన్ కల్యాణ్ కు మరోసారి సవాల్ విసిరిన వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి
- పవన్ దమ్ముంటే తనపై పోటీ చేయాలన్న ద్వారంపూడి
- పవన్ కు గతంలోనే సవాల్ విసిరానని వెల్లడి
- కాకినాడలో గ్లాసు గుర్తుతో అభ్యర్థినైనా బరిలో దించాలని వ్యాఖ్యలు
"కాకినాడలో పవన్ ఎవర్ని బరిలో దింపుతాడో చూద్దాం... ఎవరిని దింపినా ఎదుర్కొనేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కాకినాడలో గాజు గ్లాసు గుర్తుతో జనసేన అభ్యర్థి పోటీ చేస్తారని భావిస్తున్నాను. గ్లాసు గుర్తుతో అభ్యర్థిని బరిలో దింపకపోతే... పవన్ కల్యాణ్ గతంలో నాపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నట్టే లెక్క" అని ద్వారంపూడి స్పష్టం చేశారు.