కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన పొన్నం ప్రభాకర్
- కిషన్ రెడ్డి... కేసీఆర్ బినామీ అంటూ విమర్శలు
- మజ్లిస్, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనన్న మంత్రి పొన్నం
- జ్యుడిషియల్ విచారణకు బీజేపీ సహకరించాలని విజ్ఞప్తి
తెలంగాణ అభివృద్ధిలో బీజేపీ పాత్ర శూన్యం అన్నారు. జ్యూడిషియల్ విచారణకు బీజేపీ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. చాలా కేసుల్లో కేసీఆర్ను బీజేపీ కాపాడిందని ఆరోపించారు. ఇన్నేళ్లుగా కేసీఆర్, ఆయన కుటుంబంపై విచారణ ఎందుకు చేయలేదో చెప్పాలన్నారు. కేసీఆర్ను మళ్లీ కాపాడేందుకే కిషన్ రెడ్డి సీబీఐ విచారణ అంటున్నారని విమర్శలు గుప్పించారు.