‘వ్యూహం’ ఎఫెక్ట్.. డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ఇంటి ముందు టీడీపీ కార్యకర్తల ఆందోళన !
- ‘వ్యూహం’ సినిమాను విడుదల చేయొద్దంటూ ‘ఆర్టీవీ డెన్’ ముందు నిరసన చేపట్టిన టీడీపీ శ్రేణులు
- చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని హెచ్చరిక
- ఆర్జీవీ దిష్టిబొమ్మ దగ్దం.. పోలీసుల రాకతో వెళ్లిపోయిన టీడీపీ కార్యకర్తలు
రామ్ గోపాల్ వర్మ నివాసం ముందు నిరసన వ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మను దగ్ధం చేశారని సమాచారం. ‘వ్యూహం’ సినిమా విడుదలను నిలిపివేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారని తెలుస్తోంది. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌పై ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారని సమాచారం. ఇష్టం వచ్చినట్టుగా సినిమాలు తీస్తే సహించబోమంటూ ఆర్జీవీని టీడీపీ కార్యకర్తలు హెచ్చరించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే పోలీసుల రాకతో అక్కడి నుంచి వారు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఇదిలా వుంచితే ‘వ్యూహం’ సినిమా ఈ 10నే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా సెన్సార్ బోర్డు ఆపింది. అయితే తిరిగి డిసెంబర్ 29న థియేటర్లలో విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది.