చిరు సినిమాలో బాలనటుడిగా బన్నీ... ఇప్పటికీ తన రెమ్యునరేషన్ ఇవ్వలేదని వెల్లడి
- చిరంజీవి హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో 'విజేత' చిత్రం
- 1985లో రిలీజైన చిత్రం
- 'విజేత'లో శారద కొడుకుగా నటించిన అల్లు అర్జున్
ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ఫొటో పంచుకున్న అల్లు అర్జున్ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. ఆ సినిమాలో తాను ఓ పాత్ర పోషించానని, కానీ తన తండ్రి అల్లు అరవింద్ ఆ సినిమాకు సంబంధించిన తన పారితోషికం ఇంకా ఇవ్వలేదని సరదాగా వ్యాఖ్యానించారు. కాగా, బన్నీ కమల్ హాసన్ నటించిన 'స్వాతిముత్యం' చిత్రంలోనూ బాలనటుడిగా తళుక్కుమన్నారు.