మగధీర సినిమాలోలాగా అందరినీ చంపి నేను చస్తా: ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి
- వందలకొద్దీ బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని రాకేశ్ రెడ్డి వెల్లడి
- ఆర్మూర్ లో ఇకపై ఎలాంటి అక్రమాలు జరగనివ్వనన్న ఎమ్మెల్యే
- చీకటి దొంగల ఆటలిక చెల్లవని హెచ్చరిక
మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెడతానని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి చెప్పారు. అక్రమ మైనింగ్ వ్యవహారంపై విచారణ జరిపించాలని ఇప్పటికే సీబీఐని కోరామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ వస్తే పరిశీలిస్తామని సీబీఐ డైరెక్టర్ చెప్పారన్నారు. ఈ విషయంపై త్వరలోనే రాష్ట్ర హోంమంత్రి, సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి చెప్పారు. బెదిరింపు కాల్స్ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వివరించారు.