మంచు విష్ణు బర్త్ డే సందర్భంగా ‘కన్నప్ప’ నుంచి ఫస్ట్ పోస్టర్.. పెరిగిన హైప్
- నేడు మంచు విష్ణు బర్త్‌డే
- భక్త కన్నప్ప మూవీ నుంచి తొలి పోస్టర్ విడుదల
- సినిమాలో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ తారాగణం
- వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు
పాన్ ఇండియా మూవీగా రానున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం దాదాపు 80 మంది అంతర్జాతీయ ఫైటర్లు పనిచేస్తున్నట్టు సమాచారం. న్యూజిలాండ్ అడవుల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ‘కన్నప్ప’ను రూ. 150 కోట్లకుపైగా బడ్జెట్‌తో మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. హిందీలో మహాభారతం సిరీస్‌లను తెరకెక్కించిన బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్‌సింగ్ ఈ సినిమాను దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో మధుబాల, ప్రభాస్, నాయనతార, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, శరత్‌కుమార్ వంటి స్టార్లు నటిస్తున్నారు.