ఇది శాంపిల్ మాత్రమే.. రణబీర్ తో బాలయ్య 'అన్ స్టాపబుల్' పై 'ఆహా' అప్ డేట్
- బాలకృష్ణ హోస్ట్ గా అన్ స్టాపబుల్ టాక్ షో
- లేటెస్ట్ ఎపిసోడ్ లో సందడి చేయనున్న యానిమల్ టీమ్
- రణబీర్ కపూర్, రష్మిక, సందీప్ వంగాలతో బాలయ్య హంగామా
ప్రస్తుతం రణబీర్ కపూర్ యానిమల్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రణబీర్ సరసన రష్మిక మందన్న కథానాయిక. ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలో రణబీర్, రష్మిక, సందీప్ వంగా 'అన్ స్టాపబుల్' టాక్ షోలో బాలయ్యతో కలిసి సందడి చేశారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ఫొటోలను 'ఆహా' ఓటీటీ తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది.
"ఇది శాంపిల్ మాత్రమే. అసలు సిసలు షో ఇంకా ముందుంది మేరా దోస్త్! 'యానిమల్' చిత్రబృందంతో వైల్డెస్ట్ ఎంటర్టయిన్ మెంట్ కు సిద్ధంగా ఉండండి" అంటూ 'ఆహా' ఓటీటీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం 'అన్ స్టాపబుల్' టాక్ షో మూడో సీజన్ నడుస్తోంది. రణబీర్, రష్మిక, సందీప్ వంగాలతో ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది.