'మంగళవారం' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా అల్లు అర్జున్
- పాయల్ రాజ్ పుత్, నందిత శ్వేత నటించిన చిత్రం 'మంగళవారం'
- అజయ్ భూపతి దర్శకత్వంలో చిత్రం
- ఈ నెల 11న హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
- నవంబరు 17న ప్రేక్షకుల ముందుకు 'మంగళవారం'
'మంగళవారం' చిత్రం నవంబరు 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ముద్రా మీడియా వర్క్స్, ఏ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అజ్మల్ అమీర్, రవీంద్ర విజయ్, కృష్ణ చైతన్య, అజయ్ ఘోష్, శ్రవణ్ రెడ్డి, సిరితేజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించారు.
గత నెలలో విడుదలైన 'మంగళవారం' ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి విశేషమైన స్పందన లభించింది.