రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో వ్యవహారంపై మంత్రి కేటీఆర్ స్పందన
- రష్మిక డీప్ ఫేక్ వీడియో గురించి తాను వార్తల్లో చూశానన్న కేటీఆర్
- అదో చేదు అనుభవమని... ఓ సెలబ్రిటీని ఇలా కించపరచడం దారుణమన్న కేటీఆర్
- ఇలాంటి ఘటనల కట్టడికి చట్టపరంగా చర్యలు తీసుకు రావాలని సూచన
కొంతమంది ఆకతాయిలు... జారా పటేల్ అనే ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కి సంబంధించిన వీడియోకి రష్మిక మందన్న ముఖాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు ఇప్పటికే స్పందించారు. ఇలా మార్ఫింగ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తొలుత కొంతమంది ఈ వీడియో రష్మికదే అనుకున్నప్పటికీ ఆ తర్వాత జరా పటేల్ వీడియోను ఎవరో రష్మిక ఫేస్‌తో మార్ఫింగ్ చేసినట్లు గుర్తించారు. ఇలా మార్ఫింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.