సెన్సేషన్ కోసమే కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశాడు: సిద్దిపేట సీపీ శ్వేత
- రాజు దాడి చేసిన ఘటనలో ఎవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నట్లు వెల్లడి
- దాడికి వారం రోజుల ముందే కత్తి కొనుగోలు చేసి పెట్టుకున్నాడన్న పోలీస్ కమిషనర్
- ఇప్పటికే ఆధారాలు సేకరించామన్న సీపీ శ్వేత
అక్టోబర్ 30న సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేశాడని, దీంతో స్థానికులు రాజును కొట్టారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించామన్నారు. దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి చేయాలనే ప్లాన్‌తోనే కత్తి కొనుగోలు చేసి పెట్టుకున్నట్లు చెప్పారు. ఎవరూ విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టవద్దని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
నిందితుడు రాజును బుధవారం కోర్టు ముందు హాజరు పరిచారు. రాజుకు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది.