కొత్త ప్రభాకర్ రెడ్డి మీద హత్యాయత్న ఘటనపై స్పందించిన వినోద్ కుమార్
- ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి చర్యలు మంచివి కావన్న వినోద్ కుమార్
- కొత్త ప్రభాకర్ రెడ్డి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటన
- బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్
ఆషామాషీగా చూడవద్దు... తలసాని
ఈ దాడిని ఆషామాషీగా చూడవద్దని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఇది చాలా పెద్ద ఘటన అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇలాంటి దాడి ఇదే మొదటిసారి అన్నారు. ఎన్నికల కమిషన్ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలన్నారు. అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ భద్రత కల్పించాలని కోరారు. ఈ దాడి నేపథ్యంలో బీఆర్ఎస్ అభ్యర్థుల్లో భయాందోళనలు కనిపిస్తున్నాయన్నారు.