విజయ్ 68వ సినిమా కథ తిరిగేది ఈ పాయింట్ చుట్టూనే!
- నిన్ననే సెట్స్ పైకి వెళ్లిన విజయ్ 68వ సినిమా
- దర్శకుడిగా వెంకట్ ప్రభు - సంగీత దర్శకుడిగా యువన్ శంకర్ రాజా
- టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నడిచే కథ
- హీరోయిన్స్ గా ప్రియాంక అరుళ్ మోహన్ .. మీనాక్షి చౌదరి
- ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్న స్నేహ - లైలా
వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. నిన్న ఈ సినిమాకి క్లాప్ పడిన దగ్గర నుంచి, కథ ఏమై ఉంటుందనే విషయంపై అభిమానుల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ కథ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో నడుస్తుందని తెలుస్తోంది. అంటే టైమ్ మెషిన్ చుట్టూ తిరుగుతుందన్న మాట.
ఇంతకుముందు టైమ్ ట్రావెల్ సినిమాలు కొన్ని వచ్చాయి. అయితే ఏ పాయింట్ కి టైమ్ మెషిన్ ను యాడ్ చేయనున్నారనేది ఆసక్తిని రేకెత్తించే విషయం. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో, ప్రియాంక అరుళ్ మోహన్ .. మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా అలరించనున్నారు. ముఖ్యమైన పాత్రల్లో స్నేహ .. లైలా కనిపించనున్నారు.