మహేశ్ బాబు 'గుంటూరు కారం' నుంచి తొలి పాటకు రంగం సిద్ధం
- మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబోలో 'గుంటూరు కారం'
- దసరా సందర్భంగా ఆసక్తికర పోస్టర్ విడుదల
- మరోసారి ఊర మాస్ లుక్ లో మహేశ్ బాబు
- మహేశ్ ఫ్యాన్స్ కు దసరా శుభాకాంక్షలు తెలిపిన చిత్రబృందం
హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ నిర్మాతగా రూపుదిద్దుకుంటున్న 'గుంటూరు కారం' చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేశ్ బాబు సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.