కోట్లు ఖర్చు చేసినా చంద్రబాబు అందుకే జైలు నుంచి బయటకు రావడం లేదు!: బొత్స
- అధికారులను వాడుకొని అవినీతి చేసినట్లు రుజువు కావడం వల్లే బయటకు రావడం లేదన్న బొత్స
- ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లను తీసుకు వచ్చారని గుర్తు చేసిన మంత్రి
- తన హయాంలో చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేశాడని ఆరోపణ
టీడీపీ హయాంలో చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ కార్యక్రమమూ లేదని, కానీ తమ హయాంలో ఎన్నో చేపట్టామన్నారు. జగన్ నాయకత్వంలో పదవుల్లో ఎక్కువగా బలహీనవర్గాలకే దక్కుతున్నాయని తెలిపారు. తమ హయాంలో దళారి, మధ్యవర్తి వ్యవస్థలు లేకుండా ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందించిన ప్రభుత్వం తమదే అన్నారు. నాలుగున్నరేళ్ళ కాలంలో ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేశామన్నారు.