కన్నడలో పెద్ద హిట్ కొట్టిన 'జెర్సీ' హీరోయిన్ మూవీ .. ఇక ఆహాలో!
- కన్నడలో హిట్ మూవీగా 'ఆపరేషన్ అలమేలమ్మ'
- టైటిల్ రోల్ పోషించిన శ్రద్ధా శ్రీనాథ్
- కిడ్నాప్ డ్రామా చుట్టూ తిరిగే కామెడీ కథ
- ఈ నెల 27 నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్
అలాంటి శ్రద్ధా శ్రీనాథ్ కన్నడలో ఈ మధ్య 'ఆపరేషన్ అలమేలమ్మ' సినిమా చేసింది. చిన్న సినిమాగా థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, అక్కడ పెద్ద హిట్ గా నిలిచింది. 'సుని' దర్శకత్వం వహించిన ఈ సినిమాను, 'ఆహా'లో ఈ నెల 27వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారు.
శ్రద్ధా శ్రీనాథ్ జోడీగా ఈ సినిమాలో 'రిషి' కనిపించనున్నాడు. 'సైతాన్' వెబ్ సిరీస్ హీరోగా ఆయన ఇక్కడివారికి సుపరిచితమే. ఈజీగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పరమేశ్ అనే యువకుడు ఒక బిజినెస్ మేన్ కొడుకును కిడ్నాప్ చేస్తాడు. ఆ డ్రామాలోకి మిగతా పాత్రలు ఎలా వచ్చి చేరాయనేదే కథ. హాస్య ప్రధానంగా సాగే ఈ కథకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.