కూల్ డ్రింకులో బొద్దింక: 'కీడా కోలా' .. ట్రైలర్ రిలీజ్!
- తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 'కీడాకోలా'
- క్రైమ్ కామెడీ జోనర్లో నడిచే కథ
- సంగీతాన్ని సమకూర్చిన వివేక్ సాగర్
- నవంబర్ 3వ తేదీన సినిమా విడుదల
వివేక్ సుధాన్షు - శ్రీకృష్ణ నిర్మించిన ఈ సినిమాను, నవంబర్ 3వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఇద్దరు ప్రధాన పాత్రధారులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటం .. కూల్ డ్రింక్ లో ఉన్న బొద్దింక వాళ్ల కంటపడటం అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
చైతన్య రావు .. రాగ్ మయూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, తరుణ్ భాస్కర్ ఒక కీలకమైన పాత్రను పోషించాడు. క్రైమ్ కామెడీ జోనర్లో నడిచే ఈ సినిమాలో బ్రహ్మానందం ముఖ్యమైన పాత్రను పోషించారు. వివేక్ సాగర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను, రానా సమర్పిస్తూ ఉండటం విశేషం.