పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి మధ్య సయోధ్య.. పల్లాను గెలిపించాలన్న కేటీఆర్
- జనగామ బీఆర్ఎస్ నాయకులతో సమావేశమైన మంత్రి కేటీఆర్
- పల్లాకే టిక్కెట్ కేటాయించామని, గెలిపించాలని పిలుపు
- ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డికి అవకాశమిచ్చిన పార్టీ
జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డికి కేసీఆర్ టిక్కెట్ నిరాకరించి పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ముత్తిరెడ్డి అలక వహించారు. ఇరువురు నేతలు పోటాపోటీగా తమ అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలో ముత్తిరెడ్డికి ఆర్టీసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు ఉంటారు. ఇప్పుడు కేటీఆర్ ఇరువురు నేతలు, నాయకులతో కలిసి పార్టీని గెలిపించాలని సూచించారు.