హీరో రవితేజ అరుదైన ఘనత... వరల్డ్ కప్ మ్యాచ్ కు కామెంటరీ
- టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటించిన రవితేజ
- చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా క్రికెట్ మ్యాచ్ లో లైవ్ కామెంటరీ చెప్పిన రవితేజ
- మరే ఇతర హీరోకు దక్కని చాన్స్ రవితేజ సొంతం
కాగా, మరే హీరోకు లభించని అరుదైన ఘనత రవితేజకు లభించింది. ఓ వరల్డ్ కప్ మ్యాచ్ కు కామెంటరీ చెప్పిన సినీ కథానాయకుడు రవితేజనే. ఇటీవల నందమూరి బాలకృష్ణ కూడా క్రికెట్ మ్యాచ్ కు కామెంటరీ చెప్పినప్పటికీ అది ఐపీఎల్ టోర్నీ. ఇప్పుడు రవితేజ ఏకంగా ప్రపంచకప్ వంటి మెగాటోర్నీలో మైక్ పెట్టుకుని వ్యాఖ్యాతగా వ్యవహరించడం విశేషం.
రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు చిత్రం అక్టోబరు 19న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా రవితేజ క్రికెట్ లైవ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.