దేశంలో ఎక్కువ మంది అపార్థం చేసుకున్న క్రికెటర్ అతడు: అశ్విన్
- గౌతమ్ గంభీర్ స్వార్థం లేని వ్యక్తి అంటూ ప్రశంస
- జట్టులో గొప్ప సభ్యుడే కాదు, గొప్పగా పోరాడగలడన్న అశ్విన్
- అతడి కృషికి వచ్చిన గుర్తింపు తక్కువేనని వ్యాఖ్య
‘‘గౌతమ్ గంభీర్ దేశంలోనే ఎక్కువ మంది అపార్థం చేసుకున్న క్రికెటర్. జట్టులో గొప్ప సభ్యుడిగానే కాదు, తన వంతుగా పోరాడే విషయంలోనూ అతడు గొప్పగా పనిచేస్తాడు. కాకపోతే అతడు తన గురించి గొప్పగా చెప్పుకోలేడు. ఒక్క ప్రపంచకప్ ఫైనల్ అనే కాదు, ఫైనల్ కు తీసుకెళ్లిన ఎన్నో పోరాటాలు ఉన్నాయి. సాధారణంగా జట్టును ఒత్తిడిలోకి వెళ్లనీయడు. స్వార్థం లేని వ్యక్తి. అతడి పట్ల నాకు ఎప్పుడూ గొప్ప గౌరవమే ఉంటుంది. నిజానికి గంభీర్ కు ఉన్న అర్హతల కంటే (కృషికి) ప్రజలు అతడికి ఇచ్చిన గుర్తింపు తక్కువే’’ అని అశ్విన్ పేర్కొన్నాడు.