పవన్ కల్యాణ్ వెంటనే దీనిని చూడాలి: జగన్ వీడియోను షేర్ చేసిన రామ్ గోపాల్ వర్మ
- ఏపీ అసెంబ్లీలో జగన్ మాట్లాడిన వీడియోను షేర్ చేసిన ఆర్జీవీ
- బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మోడల్ గురించి ప్రస్తావన
- ఈ ఆల్కహాల్ బ్రాండ్స్ పేరుతో ఎగతాళి చేసే పవన్ ఈ వీడియో చూడాలని సూచన
ఇందులో మద్యం బ్రాండ్ల గురించి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పేర్లు వింటే తనకే ఆశ్చర్యం వేస్తోందని, ఈ బ్రాండ్లు ఏమిటి? అనిపిస్తోందన్నారు. వారు ప్రచారం చేస్తోన్న మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబువే అన్నారు. ఆయన హయాంలోనే వచ్చాయన్నారు. ఆయన ప్రచారం చేసే ప్రతి ఒక్కటీ చంద్రబాబు బ్రాండ్లే అన్నారు. అమ్మఒడి, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ జగనన్న ఇళ్ల పట్టాలు-ఇళ్లు, దిశ మాత్రమే మన ప్రభుత్వం బ్రాండ్స్ అని చెప్పారు.
బూమ్ బూమ్ బియర్, ప్రెసిడెంట్స్ మోడల్, గవర్నర్స్ చాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, ట్రిపుల్ నైన్ లెజెండ్ మద్యం బ్రాండ్స్ మాత్రం అన్నీ చంద్రన్న కానుకలు అని విమర్శలు గుప్పించారు. ఇవే కాకుండా హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హాంగర్, ఇంకా ఇలాంటివి దాదాపు 250 బ్రాండ్స్ ఉన్నాయన్నారు. ఇవన్నీ చంద్రబాబు హయాంలో వచ్చాయని చెప్పారు.