రోజవ్వకు మాటలు తప్ప మ్యాటర్ లేదు: జనసేన నేత కిరణ్ రాయల్
- ఆడ పిల్లకు అన్యాయం జరిగితే గన్ కంటే ముందు జగన్ వస్తారన్న రోజా
- భవ్యశ్రీ చనిపోయి 10 రోజులు అవుతున్నా జగన్ రాలేదని కిరణ్ ఎద్దేవా
- పరామర్శించేందుకు రోజా కూడా రాలేదని విమర్శ
ఒక మహిళా మంత్రి అయ్యుండి, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు కూడా రాలేదని మండిపడ్డారు. అదే వైసీపీకి చెందిన ఎవరి కుటుంబంలోనైనా ఇలా జరిగి ఉంటే మా అవ్వ ఎంతో ఓవరాక్షన్ చేసేదని, ఇంత పెద్ద నోరు వేసుకుని పడిపోయేదని అన్నారు. నగరికి 30 కిలోమీటర్ల దూరంలో దారుణం జరిగితే ఇంత వరకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మహిళలన్నా, బీసీలన్నా చిన్న చూపా? అని నిలదీశారు. భవ్యశ్రీ మృతి పట్ల నిజనిజాలను నిగ్గు తేల్చాలని, ఆమె మృతికి కారకులైన వారి వివరాలను బయటపెట్టి శిక్షించాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని చెప్పారు.