మైసూర్ మ్యూజియంలో బాహుబలి మైనపు బొమ్మపై ట్రోలింగ్.. తీవ్రంగా స్పందించిన నిర్మాత శోభు
- అమరేంద్ర బాహుబలి రూపం సరిగ్గా లేకపోవడంతో విమర్శలు
- మైనపు బొమ్మ ఏర్పాటుకు అనుమతి తీసుకోలేదన్న శోభు యార్లగడ్డ
- వెంటనే తొలగించేలా చర్యలు తీసుకుంటామని ట్వీట్
ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, విగ్రహం సరైన రీతిలో లేకపోవడంతో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది. మైసూరులోని చాముండేశ్వరి సెలబ్రిటీ వ్యాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఈ మైనపు బొమ్మపై బాహుబలి ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డపై స్పందించాడు. తమ అనుమతి లేకుండా దీన్ని ఏర్పాటు చేశారని అన్నాడు. ‘ఇది అధికారికంగా లైసెన్స్ పొంది చేసింది కాదు. మా అనుమతి లేకుండా రూపొందించారు. దీన్ని తొలగించడానికి వెంటనే చర్యలు చేపడతాం’ అని శోభు ట్వీట్ చేశాడు.