వాట్సాప్ చానల్స్ లో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్
- ఇటీవల చానల్స్ ఫీచర్ తీసుకువచ్చిన వాట్సాప్
- యూజర్లకు దగ్గరయ్యేందుకు చానల్స్ ఫీచర్ ఉపకరిస్తుందన్న వాట్సాప్
- టాలీవుడ్ లో ఇప్పటికే చానల్స్ క్రియేట్ చేసుకున్న రాజమౌళి, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ
తాజాగా, టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా వాట్సాప్ చానల్ ను ప్రారంభించారు. ఈ మేరకు ఆయన తన చానల్ ను చూడాలని ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ లింకును పంచుకున్నారు. వాట్సాప్ ఇటీవలే ఈ చానల్స్ ఫీచర్ తీసుకువచ్చింది. వాట్సాప్ ఉన్న ఎవరైనా సరే చానల్ ప్రారంభించవచ్చు. తమ అప్ డేట్లను యూజర్లతో పంచుకోవచ్చు. టాలీవుడ్ లో ఇప్పటికే రాజమౌళి, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి ప్రముఖులు వాట్సాప్ చానల్స్ లోకి కాలుమోపారు.