'ఆదికేశవ' నుంచి 'సిత్రాల సిత్రావతి' లిరికల్ సాంగ్ రిలీజ్!
- వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన 'ఆదికేశవ'
- ఆయన జోడీకట్టిన శ్రీలీల
- సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాశ్ కుమార్
- నవంబర్ 10వ తేదీన సినిమా విడుదల
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'సిత్రాల సిత్రావతి .. ఉన్నపాటున పోయేమతి, సూపులో పచ్చ జెండా ఎత్తి .. నన్ను చేసినవే ఛత్రపతి" అంటూ ఈ పాట సాగుతోంది. వైష్ణవ్ - శ్రీలీలపై ఈ పాటను శేఖర్ మాస్టర్ నేతృత్వంలో కలర్ఫుల్ గా చిత్రీకరించారు.
జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ బాణీకీ .. రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా .. రాహుల్ సిప్లి గంజ్ .. రమ్య బెహ్రా ఆలపించారు. జోరుగా .. హుషారుగా సాగే బీట్ తో ఈ పాట యూత్ కి కనెక్ట్ అయ్యేలానే ఉంది. నవంబర్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.