షారుక్ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ పడినట్టే.. జవాన్‌కు అదిరిపోయే రేటింగ్!
- భారీ అంచనాలతో ఈ రోజే విడుదలైన చిత్రం
- 4.5 రేటింగ్ ఇచ్చిన ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్
- ఇప్పటికే పఠాన్‌తో సక్సెస్ సాధించిన షారుక్
‘దర్శకుడు అట్లీ.. షారుక్‌ను పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. ఈ పాత్రలో షారుక్ తన దమ్ము చూపెట్టారు. పఠాన్‌తో పాటు ఈ చిత్రం కూడా అభిమానుల హృదయాలతో పాటు బాక్సాఫీస్ ను బద్దలు కొట్టనుంది. పదునైన స్క్రీన్‌ప్లే, అందరినీ కట్టిపడేసే ఎపిసోడ్స్, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు, భారీ తారాగణం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గొప్పగా ఉంది. మరీ ముఖ్యంగా షారుక్, విజయ్ సేతుపతి క్యారెక్టర్లు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ ఇద్దరితో పాటు నయనతార, దీపికా పదుకొణే, సంజయ్ దత్ అద్భుతంగా నటించారు’ అని తరణ్ పేర్కొన్నారు.