ఆదిత్య ఎల్-1 కక్ష్య పెంపు రెండోసారీ విజయవంతం
- ఈ తెల్లవారుజామున 3 గంటలకు కక్ష్య పెంపు విన్యాసం
- 10న మధ్యాహ్నం 2.30 గంటలకు మూడోసారి కక్ష్య పెంపు
- ప్రస్తుతం 282 కి.మీ. x 40,225 కి.మీ. కక్ష్యలో పరిభ్రమిస్తున్న ఆదిత్య ఎల్-1
శనివారం శ్రీహరికోట నుంచి బయలుదేరిన ఆదిత్య ఎల్-1ను హాలో ఆర్బిట్ అయిన లాంగ్రాంజియన్ పాయింట్-1 (ఎల్-1) లో ప్రవేశపెడతారు. ఈ పాయింట్ భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రయోగంలో ఉపగ్రహం సూర్యుడికి సమీపంగా వెళ్లడం కానీ, సూర్యుడి మీద లాండింగ్ కానీ ఉండదని ఇస్రో స్పష్టం చేసింది. వచ్చే ఐదేళ్లపాటు ఈ ఉపగ్రహం ఆదిత్యుడికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి పంపిస్తుంది. ఆ తర్వాత కూడా మరో 10-15 సంవత్సరాల వరకు అది పనిచేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.