ఉదయనిధికి రాజకీయ జీవితం లేకుండా శపించాలి: స్వామి స్వరూపానందేంద్ర
- సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న ఉదయనిధి స్టాలిన్
- మండిపడుతున్న వివిధ వర్గాలు
- మైనారిటీల ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని కించపరుస్తారా అంటూ స్వరూపానంద ఆగ్రహం
- వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్
"నీ తల్లి దుర్గా మాత ఆలయాలను దర్శించుకుంటుంది... ధర్మాన్ని విమర్శిస్తే నీ తల్లిని దూషించినట్టే" అని స్వరూపానందేంద్ర స్పష్టం చేశారు. ఉదయనిధికి రాజకీయ జీవితం లేకుండా శపించాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి తాను చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.